Central Home Minister Amit Shah Adilabad Tour : రాష్ట్రంలో ఎన్నికల(Telangana Assembly Election) సైరన్ మోగడంతో.. పార్టీల ప్రచార హోరు మొదలైంది. ఈసారి ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్న భారతీయ జనతా పార్టీ.. ఆ దిశగా ప్రచారం ప్రారంభించింది. గతవారం మోదీ సభలో కార్యకర్తల్లో ఊపు తీసుకొచ్చిన హైకమాండ్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తీసుకొచ్చింది. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభ(BJP Public Meeting)లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమిత్ షాకు తరుణ్‌ఛుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్ స్వాగతం పలికారు.
దిల్లీలో బయలుదేరి సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి ఆయన.. నేరుగా ఆదిలాబాద్ చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన జనగర్జన సభలో అమిత్ షా పాల్గొన్నారు. కేంద్రహోంమంత్రి సభ దృష్ట్యా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సాధారణ వాహనాలను దారి మళ్లించారు. ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును పర్యవేక్షించారు.
Amit Shah: 'రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం'
BJP Public Meeing in Adilabad : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆదిలాబాద్‌లో జరుగుతున్న సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే లక్ష్యంగా విమర్శలు చేశారు. గిరిజనులను మోసం చేసిన కేసీఆర్‌కు మూడోసారి అధికారం కట్టబెట్టవద్దని అమిత్ షా జిల్లా ప్రజలకు సూచించారు. అవినీతిలో తెలంగాణను నెంబర్వన్ను చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇక అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు అయితే స్టీరింగ్ మాత్రం మజ్లిస్ చేతిలో ఉందని.. అలాంటి పార్టీ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకు వస్తుందని అమిత్ షా ప్రశ్నించారు.
బహిరంగసభ అనంతరం అమిత్ షా తిరిగి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. 5 గంటలకు హైదరాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి తీసుకొని.. అనంతరం సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లోని ఓ మందిరంలో నిర్వహించే మేధావుల సమావేశానికి హాజరై సూచనలు స్వీకరించనున్నారు.
సాయంత్రం 6.20 గంటల నుంచి 7.20 గంటల వరకు ఈ మేధావుల సమావేశం కేంద్రహోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. అనంతరం వారు ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశం అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లనున్నారు. రాత్రి 7.40 గంటల నుంచి రాత్రి 8.20 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఎన్నికల వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. రాత్రి భోజనం చేసి.. అనంతరం 9.45 గంటలకు తిరిగి దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.