ETV Bharat / state

వివాహనానికి 45 మందితో ప్రయాణం... తృటిలో తప్పిన ప్రమాదం

ఆదిలాబాద్​ ఇచ్చోడలో 45 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. వివాహానికి సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్తుండగా అనుకోకుండా బస్సు బ్రేకులు ఫెయిల్​ అయ్యాయి. ఈ పరిణామంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాదోళనకు గురి అయ్యారు. డ్రైవర్​ చాకచక్యం, కొందరూ ప్రయాణికుల చర్య వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

author img

By

Published : Feb 14, 2020, 2:34 PM IST

వివాహనానికి 45 మందితో ప్రయాణం... తృటిలో తప్పిన ప్రమాదం
వివాహనానికి 45 మందితో ప్రయాణం... తృటిలో తప్పిన ప్రమాదం
వివాహనానికి 45 మందితో ప్రయాణం... తృటిలో తప్పిన ప్రమాదం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయంలో పెళ్లి జరుపుకోడానికి వెళ్తున్న నూతన వధూవరులతో ఉన్న బస్సు కు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఉట్నూరుకు చెందిన కవిత తన బంధువులతో కలిసి ఓ పాఠశాల బస్సులో సిరిచెల్మకు వెళుతుండగా బస్సు బ్రేకులు ఫెయిలై... ఘాట్ రోడ్డు మూలమలుపు వద్ద రోడ్డు పక్కకు దిగింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులు, వధూవరులు అరుపులు కేకలు వేశారు.

అందులోని కొందరు వ్యక్తులు కిందకు దిగి బస్సు చక్రాల కింద రాళ్లు వేయడం .. డ్రైవర్ వాహనాన్ని నియంత్రించడం వల్ల తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందురు ఊపిరిపీల్చుకున్నారు. మల్లన్న ఆశీర్వాదంతో సురక్షితంగా తాము బయట పడ్డామని వారంతా పేర్కొన్నారు.

ఇవీ చూడండి: తల్లీకుమార్తె దారుణ హత్య.. అతని పనేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.