తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంలోనే కాదు సామాజిక కార్యక్రమాల్లో ముందుంటుందని ఆ సంస్థ సీటీఎం రాజేందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఆవరణలో జరిగిన రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. తానే స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన్ను చూసి మరికొందరు అధికారులు రక్తదానం చేయగా.. కార్మికులు భాగస్వాములయ్యారు.
ఇదీ చూడండి : స్నేహితులతో కలిసి పెద్దమ్మ ఇంటికి కన్నం