ETV Bharat / state

పాఠశాలలో క్షుద్రపూజల కలకలం.. గమనించిన ప్రిన్సిపల్​ ఏం చేశారంటే.?

Occult Worship Spotted In Model School: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ప్రపంచం దూసుకుపోతున్నా.. కొన్ని మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయి. దుష్ట శక్తుల ప్రభావాన్ని తమపైకి మళ్లించారంటూ అనవసరంగా బెంబేలెత్తిపోతారు. తమ ఇంటిపక్కన పసుపు, కుంకుమ, నిమ్మకాయ కనిపించిందంటే చాలు.. వామ్మో ఎవరో తమకు చేతబడి చేశారంటూ అల్లకల్లోలం అయిపోతారు. రోడ్డు పక్కన, వీధుల్లో ఇలాంటి దృశ్యాలు సహజమే.. కానీ ఓ పాఠశాల ఆవరణలో ఇలాంటి దృశ్యమే కనిపించింది. అంతే ఒక్కసారిగా విద్యార్థులు హడలెత్తిపోయారు.

kshudra pooja in jainath model school
జైనథ్​ ఆదర్శ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం
author img

By

Published : Mar 26, 2022, 5:10 PM IST

Occult Worship Spotted In Model School: ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​లోని ఆదర్శ పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. శుక్రవార రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు.. పాఠశాల గేటు ఎదుట రెండు ఇనుప కడ్డీల చుట్టూ వస్త్రం చుట్టి, నేలలో పాతారు. దాని ముందు.. రెండు కోడిగుడ్లు, పసుపు, కుంకుమ చల్లి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తెల్లవారుజామున యథావిధిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు గేటు ముందర పసుపు, కుంకుమ, కోడిగుడ్లు పడి ఉండటాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. వెంటనే స్కూలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన యాజమాన్యం.. వాటిని తొలగించి ఎప్పటిమాదిరిగానే తరగతులు నిర్వహించారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపల్​ మహమ్మద్​ జావెద్​ను వివరణ అడగ్గా.. విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడానికి పోకిరీలు చేసిన పనిగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బంది చేత వాటిని తొలగించినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Stanplus Red Ambulance: కాల్‌ చేస్తే.. 8 నిమిషాల్లో రెడ్‌ అంబులెన్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.