ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో పాటు లక్కారం అంగన్వాడీ కేంద్రం ముందు బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. రకరకాల రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు.
ఇవీ చూడండి: మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి: హరీశ్‌రావు