ఆదిలాబాద్ జిల్లాలో 334 పంచాయతీలు ఉండగా, ఇందులో మొదటి విడతగా 92 పంచాయతీల్లో, రెండో విడతగా 42 పంచాయతీల్లో ఈ ఆడిట్ చేస్తారు. మొదటి విడతలో 92 పంచాయతీలో 120 అభ్యంతరాలు వచ్చాయి. నిధులు ఏమేరకు పక్కదారి పట్టాయో అధికారులు తుదిలెక్కలు చూస్తున్నారు. గతంలో ఏటా ఆయా పంచాయతీలకు వచ్చిన ఆదాయం, నిధులు, ఖర్చులను మరుసటి సంవత్సరం ఆరంభంలో ఆడిట్ అధికారులు తనిఖీలు చేసేవారు. ప్రస్తుతం పంచాయతీల దస్త్రాలన్నీ పరిశీలించి, వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పంచాయతీ అధికారులు సైతం పర్యవేక్షించే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో ఆడిట్ వివరాలన్నీంటిని ప్రజల ముందుకు వస్తాయని అధికారులు అంటున్నారు.
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పంచాయతీలకు వచ్చే నిధులు, పన్ను వసూళ్లు, ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం వచ్చే వాటిని ఖర్చు చేసి, వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో సంబంధిత సిబ్బంది బిల్లులు జమచేయడం లేదు. సరైన లెక్కలు లేవని ఏటా ఆడిట్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఆశించిన రీతిలో మార్పు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లోని పంచాయతీలకు సంబంధించి 35 వేల అభ్యంతరాలు రాగా, ఇందులో రూ.8 కోట్లు నిధులకు సంబంధించి పంచాయతీ అధికారులు తగిన దస్త్రాలు చూపించలేదు.
నోటీసులు అందజేస్తాం
ఈ ఆడిట్ మొదటి విడత పూర్తయింది. రెండు రోజుల్లో రెండో విడత ప్రారంభిస్తామని జిల్లా ఆడిట్ అధికారి రాజేశం తెలిపారు. పంచాయతీ నిధుల వ్యయంలో లెక్కలు చూపకపోతే అభ్యంతరాలుగా ఉంచుతాం. వీటికి సంబంధించిన రశీదులు ఇవ్వకపోతే నోటీసులు అందజేస్తాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
ఇదీ చూడండి: ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న ధరణి సేవలు.. అడ్డుగా ఏజెన్సీ చట్టాలు..