కరోనా కట్టడికి ఆదిలాబాద్ మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రహదారులపై రసాయనాల పిచికారికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఐదు వాహనాలను సిద్ధంగా ఉంచి 49 వార్డుల్లో రసాయనాలను చల్లే ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, పుర అధ్యక్షులు జోగు ప్రేమెందర్ ప్రారంభించారు.
సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని వార్డు కౌన్సిలర్లు తమ వీధుల్లో వాహనాల సాయంతో పిచికారి చేయించాలని ఎమ్మెల్యే వారిని కోరారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించాలని జోగు రామన్న అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: ప్రజలు ఆకలితో అలమటించొద్దు: కేసీఆర్