ETV Bharat / state

Aanganwadi issues : అమలు కాని కొత్త వేతనాలు... ఏడేళ్లుగా అందని టీఏ, డీఏలు - anganwadi latest news

అంగన్వాడీ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా (Aanganwadi issues) మారింది. అంగన్వాడీ కేంద్రాలతోపాటు ఎన్నికల విధులు, కరోనా సర్వే, టీకాల పర్యవేక్షణ, ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా పెరిగిన వేతనాలు అందడంలేదు. ఏడేళ్లుగా టీఏ, డీఏలు ఇవ్వకపోవడంతో అదనంగా ఖర్చులను భరించాల్సి వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో మొత్తం 4,103 కేంద్రాలుంటే మహిళాశిశుసంక్షేమం, వైద్యశాఖలతోపాటు ఇటీవల ప్రభుత్వ పథకాల నిర్వహణలో అంగన్వాడీ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారింది.

Aanganwadi issues
Aanganwadi issues
author img

By

Published : Oct 1, 2021, 4:21 PM IST

ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ల గౌరవవేతనం రూ.7,500 ఉండేది. కేసీఆర్‌ సర్కారు కొలువుదీరాక రూ.3000 పెంచడంతో రూ.10,500కు చేరింది. 2018 అక్టోబర్‌ 2న కేంద్రం దసరా కానుకగా మరో రూ.1,500 పెంచడంతో రూ.12లకు పెరిగింది. ఈ ఏడాది జులై నెలలో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,150 పెంచింది. ఈ లెక్కన ప్రతి అంగన్వాడీకి రూ.15,150 వేతనం ఇవ్వాలి. కానీ కేంద్రం దసరా కానుకగా ప్రకటించిన రూ.1,500లను పరిగణలోకి తీసుకొనే రాష్ట్రప్రభుత్వం రూ.3,150 పెంచడంతో రూ.13,650కే పరిమితమైంది. ఇవి కూడా చెల్లించడంలేదు. కాగితాల్లో వేతనాలు పెంచినట్లు ప్రకటించారే కానీ అంగన్వాడీలకు చెల్లిస్తున్నది కేవలం రూ.10,500 వేతనమే. మినీ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలకు పెరిగిన వేతనాలను పరిగణలోకి తీసకుంటే రూ.8,550 చెల్లించాల్సి ఉంది. కానీ ఆచరణలోకి రాకపోవడంతో నెలకు రూ.6,000 చొప్పున పాత వేతనాలతోనే పనిచేయాల్సి వస్తోంది.

ఏడేళ్లుగా టీఏ, డీఏల కోసం నిరీక్షణ

నెలనెల సీడీపీవోల పరిధిలో ప్రాజెక్టు సమావేశం, పర్యవేక్షకుల పరిధిలో సెక్టారు సమావేశం నిర్వహించాలనేది శిశుసంక్షేమశాఖలోని ప్రధాన నియమం. ఒక్కో సమావేశానికి రూ.260 డీఏ చొప్పున రెండు సమావేశాలకు కలిపి రూ.520 డీఏతోపాటు రవాణా ఛార్జీలు ఇవ్వాల్సి ఉంది. సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారే కానీ టీఏ, డీఏలు చెల్లించకపోవడంతో ఖర్చులను అంగన్వాడీలే భరించాల్సివస్తోంది. నెలనెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వడంలేదు. కొన్ని సందర్భాల్లో మూడు, నాలుగు నెలలకోసారి వేతనాలు విడుదల చేస్తుండంతో ఏ నెల వేతనం ఎప్పుడు విడుదవుతుందో తెలియక అయోయమానికి గురికావాల్సి వస్తోంది. 2014, 2016, 2017 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కో నెల వేతనం ఇప్పటికీ రాలేదు. ఆ వేతనాలు ఎవరు కాజేశారనేది అంతుచిక్కడంలేదు. వీటికోసం అంగన్వాడీ కార్యకర్తలు చాలా సార్లు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.

గౌరవవేతనం పరిధిలో చేసే సేవలే

సహజంగానైతే అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఆటపాటలతో కూడిన చదువు చెప్పాలి. పిల్లల్లో ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం మధ్యాహ్న భోజనం పెట్టాలి. గర్భిణీలు, బాలింతల యోగక్షేమాలను పర్యవేక్షించాలి. వారికి పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం కేంద్రంలోనే వడ్డించాలి. పిల్లల ఎదుగుదలలో ప్రధానమైన ఎత్తు, బరువు, ఆరోగ్యస్థితిగతులను మాతాశిశుసంక్షేమంలోభాగంగా ప్రభుత్వం నిర్ధేశించిన 14 రిజిస్టర్లను రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ గౌరవవేతనం పరిధిలో చేసే సేవలే.

అదనపు విధులు

రాష్ట్రం ఏర్పడిన తరువాత అంగన్వాడీ కేంద్రాల నిర్వహణతోపాటు అదనపు విధులను అంగన్వాడీలకు కట్టబెట్టింది. ఇందులో ప్రధానంగా వైద్యారోగ్యశాఖ పరిధిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో అంగన్వాడీలను భాగస్వాములను చేశారు. గ్రామ, పట్టణ పరిధిలో ఎప్పటికప్పుడు ఓటరు జాబితాలను సరిచేసే బీఎల్‌వో విధులు నిర్వహించాల్సి వస్తోంది. రెండేళ్లుగా ఇంటింటికి వెళ్లి కరోనా సర్వే చేసే బాధ్యతలను అప్పగించారు. పిల్లలకు ఇచ్చే టీకాలు, తాజాగా కరోనా టీకాలపర్యవేక్షణ బాధ్యతలను కూడా అంగన్వాడీలకు అప్పజెప్పారే కానీ అదనపు విధులకు ఎలాంటి పారితోషికం ఇవ్వడంలేదు.

అందరూ భయపెట్టేవారే

Aanganwadi issues
సునీత, అంగన్వాడీ సంఘం జిల్లా కార్యదర్శి

'గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రతి ప్రభుత్వ పనిలో మమ్మల్ని భాగస్వాములను చేస్తున్నారు. కరోనా సర్వే చేస్తుంటే కనీసం శానిటైజర్లు, మాస్కులు ఇవ్వడంలేదు. జరగరానిదేమైనా జరిగితే మా పిల్లలకు ఎవరు దిక్కు? గ్రామ కార్యదర్శి మొదలుకొని జిల్లాస్థాయి అధికారి వరకు ఏ పనిచెప్పినా వెనకడుగు వేయకుండా చేస్తూనే ఉన్నాం. కానీ దానికి తగిన ఫలితం ఉండటంలేదు. పైగా ప్రతి ఒక్కరు భయపెట్టేవారే. గుత్తేదారులు గుడ్లు, పప్పులు, పాలు బాలామృతం ఎలాంటివి ఇచ్చిన తీసుకోవాల్సిందే. నాణ్యతలేనివని ప్రశ్నిస్తే సరకులే ఇవ్వడంలేదు. ఎవరికి చెప్పినా ప్రయోజనం ఉండటంలేదు. వెట్టిచాకిరిగా మారిన మా బతుకులను అధికారులు పట్టించుకొని న్యాయం చేయాలి."

- సునీత, అంగన్వాడీ సంఘం జిల్లా కార్యదర్శి

ఇదీ చదవండి : KCR Speech in Assembly 2021: ఏకగ్రీవ పంచాయతీలకు నిధులిస్తమని మేమెప్పుడు చెప్పినం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.