ఆదిలాబాద్ పట్టణ శివారులోని 68 సర్వే నంబర్‌ను వక్ఫ్‌బోర్డు స్థలంగా మారుస్తూ.. రెవెన్యూ అధికారులు ధరణిలో నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. స్థిరాస్తి వ్యాపారులతో పాటు ఆ సర్వే నంబర్లో ప్లాట్లను కొనుగోలు చేసిన కొంతమంది జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
రెవెన్యూ అధికారుల నిర్ణయంతో తాము తీవ్రంగా నష్టపోతామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులను సవరించి వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సీఎస్ సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ