వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆదిలాబాద్ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహించారు. రైల్వేస్టేషన్ ఎదుట నిరసన తెలిపిన ఆందోళనకారులు... లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
స్టేషన్ ఎదుట నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి : డీజీపీ కార్యాలయ ముట్టడికి 'భాజపా' యత్నం.. ఉద్రిక్తం