ETV Bharat / state

ఏజెన్సీ బంద్​.. స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత

ఆదిలాబాద్​ జిల్లాలోని పలు మండలాల్లో తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల నాయకుల పిలుపు మేరకు బంద్​ విజయవంతమైంది. జీవో నంబర్​ 3 రద్దును నిరసిస్తూ నాయకులు బంద్​ ప్రకటించారు. మండల కేంద్రాల్లోని దుకాణాలు, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు.

agency bandh due to cancellatiion of go number 3 in adilabad district
ఏజెన్సీ బంద్​.. స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత
author img

By

Published : Jun 9, 2020, 6:59 PM IST

జీవో నంబర్ 3ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, నార్నూర్, జైనూర్, ఇంద్రవెల్లి మండలాల్లో మంగళవారం బంద్​ సంపూర్ణంగా విజయవంతమైంది. తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రాల్లోని దుకాణాలు, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు.

జీవో నంబర్ 3 అమలు చేయకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు ఉద్యోగాల నియామక సమయంలో పూర్తిగా నష్టపోతారని నాయకుడు బాబురావుతో పాటు పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు .ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నంబర్​ 3ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.

ఇవీ చూడండి: సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలన్న పిటిషన్​ కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.