ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆదివాసీలు మహా ధర్నా నిర్వహించారు. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ బాబురావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అర్హులైన గిరిజనులకు మూడెకరాల భూమిని ఇచ్చి అటవీ హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. అటవీ అధికారుల తీరును దుయ్యబట్టారు. కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చదవండిః గోదావరి నీరు లేక బోసిపోయిన బాబ్లీ ప్రాజెక్ట్