కూతురి సంతోషం కోసం నానా తంటాలు పడైనా సరే.. అల్లుడు కోరుకున్న వాహనాన్ని కట్నంగా ఇస్తారు ఆడపిల్ల తల్లిదండ్రులు. కానీ ఆదివాసీలు మాత్రం.. అందుకు భిన్నంగా ఎడ్ల బండ్లను ఇస్తున్నారు. జీవనోపాధికి ఉపయోగపడుతుందనే కారణంతో.. ఆ నూతన వరుడూ దాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాడు. వివాహం అనంతరం.. జరిగే ఈ అరుదైన వేడుకను చూడాలంటే ఆదిలాబాద్‌కు వెళ్లి తీరాలి.
ఆదివాసీలు.. పెళ్లిల్లో కట్నాలు ఇవ్వరు. వారి సంప్రదాయం ప్రకారం.. ముందుగా ఆడపిల్లకు వివాహం జరిపించి అత్తవారింటికి పంపుతారు. ఆ తర్వాత వచ్చే మొదటి దీపావళి పండుగకు నూతన వధూవరులను పిలుస్తారు. వారికి తోచిన వస్తువులను ఇచ్చి పంపుతారు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతున్నా.. ప్రస్తుతం వీరు మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.
అప్పగింతలు జరిగే సమాయానికి కాస్త ముందుగా.. ఎండ్ల బండిని అల్లుడికి కానుకగా ఇస్తున్నారు. నూతన వధూవరులతో వాటికి పూజలు జరిపిస్తారు. గుడిహత్నూర్, జైనూర్ మండలాల పరిధుల్లో ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయి.
ఇదీ చదవండి: 'దొంగతనం చేస్తారు... ఇంటి యజమానినే మీరెవరని ప్రశ్నిస్తారు'