ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించి అంటు వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని ఆదిలాబాద్ పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ సూచించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి రోడ్డు పక్కన ఉన్న గడ్డిని తొలిగించారు.
ప్రతి ఒక్కరూ ఆదివారం ఓ పదినిమిషాల పాటు ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకునేందుకు సమయం కేటాయించుకోవాలని తెలిపారు. ఎలాంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా పది నిమిషాలు పనిచేయాలని పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం