ETV Bharat / state

చదువుతో ఉజ్వల భవిష్యత్తు: న్యాయమూర్తి కంచు ప్రసాద్

పిల్లలను ఉన్నత చదువులు చదివించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని ఆదిలాబాద్ సీనియర్​​ సివిల్​ కోర్టు న్యాయమూర్తి కంచు ప్రసాద్​ సూచించారు. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండలంలోని ఘన్​పూర్​, హస్నాపూర్​ గ్రామాల్లో ఆయన పర్యటించారు.

adilabad senior civil court judge visited villages in district
'చదువుతో అన్ని రంగాల్లో రాణించవచ్చు'
author img

By

Published : Jul 4, 2020, 11:36 AM IST

పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని.. చదువుతో అన్ని రంగాల్లో రాణించవచ్చని ఆదిలాబాద్ సీనియర్​​​ సివిల్​ కోర్టు న్యాయమూర్తి కంచు ప్రసాద్ అన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశానుసారం ఉట్నూర్ సివిల్ కోర్టు జడ్జి సుధాకర్, జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి మనోహర్​తో కలిసి ఉట్నూరు మండలంలోని ఘన్​పూర్​, హస్నాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ముందుగా గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా లేదా కోణంలో పూర్తి వివరాలు సేకరించారు.

గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కరోనాను నివారించాలన్నారు. అనంతరం ఆ ప్రాంత ప్రజలకు దోమతెరలు పంపిణీ చేశారు.

ఇవీ చూడండి: రైల్వే బోర్డు కీలక నిర్ణయం.. కొలువులకు ఎర్రజెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.