కుటుంబాలకు దూరంగా ఎన్నో ఎళ్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నామని... రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు ఆందోళన బాటపట్టారు. ఇకనైనా ప్రభుత్వం తమ స్వస్థలాలకు సమీపంలోని ఆస్పత్రులకు బదిలీ చేయాలని... గంటసేపు విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు.
వృద్ధాప్యంలో అనారోగ్యం బారినపడిన తమ కుటుంబ పెద్దలకు అందుబాటులో ఉండలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బదిలీ నిషేధాన్ని ఎత్తివేసి తమకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే విధులు బహిష్కరించి నిరవధిక ఆందోళనకు సిద్ధమవుతామన్నారు.
ఇదీ చదవండి: 2021 చివర్లో అమెరికాకు మోదీ!