పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆదిలాబాద్ రిమ్స్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సోమవారం అధికారుల వైఖరి పట్ల మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. కరోనా లాంటి ఈ సమయంలో రోగులకు సేవలు అందించాల్సిన తాము రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపాల్సిన దుస్థితి నెలకొందని స్టాఫ్ నర్సులు వాపోయారు.
ఏడు నెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా.. రిమ్స్ డైరెక్టర్, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. ఈ నిరసనలో స్టాఫ్ నర్సులు బి.పెర్సి, జి.కవిత కరుణ, బి.వసంత రాణి, జె.జయ, కమలాబాయి, వాగ్మరే సారిక, డి.పద్మావతి, ఆడే స్వప్న ఏఐటీయూసీ నాయకుడు దేవేందర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వైద్యులు లేని ఆస్పత్రులు.. రోగులకు తప్పని ఇబ్బందులు!