మాస్కు ధరించకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా విధిస్తామని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు బయట తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్లో కొన్ని నిబంధనలు సడలించడం వల్ల ప్రజలు రహదారులపైకి వస్తున్నారు. మాస్కు ధరించకుండా బయటకు వచ్చిన వారి పేర్లు, వివరాలను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు నమోదు చేసుకుంటున్నారు. అక్కడే వారి వద్ద ఉన్న కర్చీఫ్‌తో మాస్కు కట్టించి పంపిస్తున్నారు. రెండో సారి నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో రాకపోకలపై పోలీసులు నిఘాను పటిష్ఠం చేశారు.