కరోనా ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో వాహన రాకపోకలపై ఆంక్షాలు విధించారు. అత్యవసర సేవల కోసం అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆసుపత్రికి వెళ్లాలనుకునేవాళ్ల కోసం కలెక్టరేట్‌లో పది అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్ కంట్రోల్ రూం 18004251939కి ఫోన్ చేస్తే చాలు ఉచితంగా అంబులెన్స్ వస్తుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రయోగంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు..
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం