ములుగు జిల్లాలో తుడుందెబ్బ నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తూ ఉద్యమ అణచివేతకు కుట్రపన్నుతోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో ఏర్పాటుచేసిన కుమురంభీం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేదాకా ఆదివాసీల ఉద్యమాన్ని ఆపేది లేదని ఎంపీ స్పష్టం చేశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగానే పొరాటం సాగుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గ్రేటర్లో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్