నెల రోజుల క్రితం మంచిర్యాల జిల్లా పులిమడుగు అటవీ ప్రాంతంలో కొంతమంది ఒక అలుగును బంధించి దానిని విక్రయించేందుకు యూట్యూబ్లో వీడియో పెట్టారని తెలిపారు. ఆ అలుగును విక్రయించేందుకు 20 మంది వరకు సంప్రదింపులు జరిపారని వారిలో 10 మందిని పట్టుకున్నామని ఇంకా విచారణ కొనసాగుతుందని త్వరలోనే మిగితా వారిని పట్టుకుంటామని ఆదిలాబాద్ సర్కిల్ అటవీ సంరక్షణ అధికారి వినోద్ కుమార్ పేర్కొన్నారు. అటవీ జంతువులను బంధించినా, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులను ప్రశంశించారు. ఈ సమావేశంలో అసిఫాబాద్ డీఎఫ్ఓ ప్రభాకర్, మంచిర్యాల డీఎఫ్ఓ శివాని దొంగ్రే, కాగజ్ నగర్ ఎఫ్డీవో విజయ్ కుమార్, బెల్లంపల్లి ఎఫ్డీవో లావణ్య తదితరులు పాల్గొన్నారు. నిందితుల పేర్లు.. బానోత్ కుమార్, మందమర్రి అవునూరి సంతోష్, మందమర్రి కొత్తూరు ఆశన్న, సిర్పూర్ (యూ)దాసరి శేఖర్, మందమర్రి వింకరే ప్రకాష్, లింగపూర్ సయ్యద్ దావుద్, జైనూర్ సరమల్ల రవీందర్, ఇటిక్యాల గోమాసే చిరంజీవి, సిర్పూర్. టిడొల్లే మల్లికార్జున్, దుగినేపల్లి ఉట్నూరు పోచయ్యచారి అని తెలిపారు.
ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు