మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లు ఎలాంటి ఇబ్బంది పడకుండా అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. పట్టణంలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్‌లు అందాయా? అంటూ ఆరాతీశారు.
ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు తీసుకెళ్లాల్సిన గుర్తింపుకార్డుల గురించి వివరించారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలంటూ కోరారు. పాలనాధికారే స్వయంగా తమ ఇళ్లకు వచ్చి ఓటరు స్లిప్‌ల గురించి ఆరాతీయడం.. ఓటువేయమని కోరడాన్ని పట్టణవాసులు స్వాగతిస్తున్నారు.
ఇదీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు