ETV Bharat / state

'పల్లె ప్రగతితోపాటు పట్టణాభివృద్ధిపై దృష్టి సారించాలి' - ఆదిలాబాద్​ కలెక్టర్​ సమీక్ష

పల్లె ప్రగతితో పాటు పట్టణాభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అధికారయంత్రాంగాన్ని ఆదిలాబాద్​ కలెక్టర్​ శ్రీదేవసేన ఆదేశించారు.

adilabad collector sri devasena review on city development
'పల్లె ప్రగతితోపాటు పట్టణాభివృద్ధిపై దృష్టి సారించాలి'
author img

By

Published : Feb 15, 2020, 3:52 PM IST

'పల్లె ప్రగతితోపాటు పట్టణాభివృద్ధిపై దృష్టి సారించాలి'

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి సంబంధించి ఆదిలాబాద్ కలెక్టర్ శ్రీ దేవసేన అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. పల్లె ప్రగతి తో పాటు పట్టణ ప్రగతిపైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు నిర్మించేలా చూడాలన్నారు. ప్రతి ఇంటిని కిచెన్ గార్డెన్​గా మార్చేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. మహిళల్లో ఉన్న రక్తహీనతను దూరం చేసేలా కిచెన్ గార్డెన్​లో కూరగాయలు సాగు చేసేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు.

ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈ సమావేశంలో డీఆర్వో నటరాజ్, డీఆర్డిఓ రాజేశ్వర్, డీపీఓ సాయిబాబా, డీఈఓ రవీందర్ రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.