ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్​ - ఆదిలాబాద్​ జిల్లా వార్తలు

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ పర్యటించారు. పల్లె ప్రగతి పనులతో పాటు రైతువేదిక నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

adilabad collector inspected development works in district
రైతు వేదిక నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్​
author img

By

Published : Aug 27, 2020, 3:41 PM IST

గ్రామాల్లో పల్లె ప్రగతి పనులతో పాటు రైతు వేదిక నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్​ జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. జిల్లాలోని ఉట్నూర్ మండలం శ్యాంపూర్, తాండ్ర, లక్కారం గ్రామాల్లో ఆమె పర్యటించారు. తాండ్ర గ్రామంలో చేపట్టిన ప్రకృతి వనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం లక్కారం గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించారు. పనులు పూర్తైన వెంటనే ప్రారంభించాలని సూచించారు.

లక్కారం సర్పంచ్ జనార్ధన్ స్మశాన వాటిక నిర్మాణానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్​కు విన్నవించారు. వెంటనే స్థానిక తహసీల్దార్ ఎంపీడీవోతో మాట్లాడి ప్రభుత్వ భూమిని చూసి వారికి కేటాయించాలని ఆదేశించారు. అనంతరం గ్రామాభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉట్నూర్ మండలంలో చేపడుతున్న పల్లె ప్రగతి, రైతు వేదిక నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చూడండి: రైతుల పాలిట శాపంగా మారిన ఫీడర్‌ ఛానల్‌ కాలువ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.