ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ టీకా వేయించుకోవాలని ఆదిలాబాద్ అదనపు ఎస్పీ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో పోలీసుల కుటుంబ సభ్యులకు నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.
కరోనా మహమ్మారి తరిమికొట్టాలంటే టీకానే సరైన మార్గమని అదనపు ఎస్పీ వినోద్ కుమార్ అన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం ప్రతీఒక్కరూ బాధ్యతగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రేషన్ కార్డు పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిశీలించాలి: మంత్రి గంగుల