లాక్డౌన్ కారణంగా అనేక మంది జీవితాలు మారిపోయాయి. ముఖ్యంగా దినసరి పనులు చేసుకుని జీవించే వారి జీవితాలు దుర్భరమయ్యాయి. ఈ తరుణంలో పెళ్లిళ్లల్లో వంటలు చేసే ఆచారులు పనులు లేక పస్తులుంటున్నారు. ఒక రోజు తిని, మరొక రోజు తినక గడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లిల్లు, ఫంక్షన్లకు అనిమతి ఇచ్చినా.. 20 మందికి మించకూడదని చెప్పాయి. ఈ నేపథ్యంలో ఎవ్వరూ కూడా పెద్ద ఎత్తున బోజనాలు పెట్టడం లేదు. ఈ తరుణంలో వారికి ఉపాధి కరవై కుటంబాలను పోషించడం భారంగా మారిందని వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి : ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు