ఆదిలాబాద్ జిల్లాలో జోరు వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. 30కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరద ప్రవాహంతో అనుకుంటవాగు పొంగి పొర్లుతోంది.
వాగుదాటే ప్రయత్నంలో బంగారుగూడ వాసి నీటిలో చిక్కుకుపోయాడు. అర్ధగంటపాటు యువకుడు వాగులోనే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఎట్టకేలకు మరో వ్యక్తి వాగులోకి దిగి... చాకచక్యంతో బాధితుడిని కాపాడాడు.
ఇదీ చదవండి: Weather report: రాగల 3 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు