ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు సంస్థను బురిడీ కొట్టించి... దొరికిపోయిన ఘటన వెలుగుచూసింది. ఒకే వాహనంలో పత్తి తీసుకొచ్చి దాన్ని రెండు జిన్నింగ్‌లలో విక్రయించినట్లు రికార్డుల తనిఖీలో బయటపడింది.
తలమడుగు మండలానికి చెందిన ఓ రైతు మాక్స్ వాహనంలో 11 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా మార్కెట్‌యార్డులో దళారిగా పని చేసే మరో యువకుడు ఆ వాహనాన్ని జిన్నింగ్‌లోకి తీసుకెళ్లాడు. పత్తి ఖాళీచేయకుండానే తిరిగి యార్డుకు తీసుకెళ్లిపోయాడు. మళ్లీ తూకం వేయించి మరో జిన్నింగ్‌లో పత్తిని ఖాళీ చేయించాడు.
ఈ క్రమంలో రెండు చోట్ల పత్తి విక్రయాలు జరిగినట్లుగా రికార్డు నమోదు కాగా.. రెండుసార్లు సొమ్ము పొందాలని పన్నాగం వేశారు. ఈ వ్యవహారంలో తాత్కాలిక సిబ్బంది సహకారం ఉందని తేల్చిన అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించారు. కేసు పెట్టాలని భావించినా తప్పిదాన్ని ఒప్పుకోవడంతో వదిలేశామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేయాలి'