ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేటలో ఆస్తి తగాదాలు ప్రాణాలు తీసేంత వరకు వెళ్లాయి. విశ్రాంత పోలీస్ ఉద్యోగి ఏఎస్ఐ శివరాజ్(62), ఉద్యానశాఖలో విధులు నిర్వహిస్తున్న జయరాజ్ మధ్య ఆస్తి తగాదాలు జరుగుతుండేవి. ఇదే విషయమై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా లాభం లేకుండాపోయింది.
శివరాజ్‌కు తన తమ్ముని కుమారుడు జయరాజ్‌కి మధ్య శుక్రవారం గొడవ జరిగింది. ఘర్షణ తీవ్రంగా మారి కర్రలతో కొట్టుకునేంత వరకు వెళ్లింది. ఈ ఘటనలో శివరాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించగా... మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
మరణ వార్త విన్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శివరాజ్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.