ETV Bharat / state

సాహిత్య సాంస్కృతికోత్సవాల పేరిట.. త్వరలో జిల్లాకో గ్రంథం

A book on each district: తెలంగాణ నూతన రాష్ట్రంగా అవతరించిన తర్వాత సాహిత్య సాంస్కృతికోత్సవాల పేరిట జిల్లాకో గ్రంథాన్ని ముద్రించాలని రాష్ట్ర సారస్వత పరిషత్‌ నిర్ణయించింది. పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పడిన 33 జిల్లాలకు నిఘంటువులాగా ప్రత్యేక పుస్తకాన్ని తీసుకురావాలని సంకల్పంచింది. ఇప్పటికే జిల్లాలవారీగా కన్వీనర్లను సైతం ఎంపిక చేసింది.

A book on each district:
సాహిత్య సాంస్కృతికోత్సవాల పేరిట జిల్లాకో గ్రంథం
author img

By

Published : Apr 8, 2022, 11:51 AM IST

సాహిత్య సాంస్కృతికోత్సవాల పేరిట జిల్లాకో గ్రంథం

A book on each district: దేశమైనా, రాష్ట్రమైనా వాటి భౌగోళిక స్థితిగతులన్నీ గ్రంథాల్లో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగానే బాహ్యప్రపంచానికి తెలుస్తాయి. కాకతీయలు, శాతవాహనులు, రెడ్డిరాజులు, శ్రీకృష్ణ దేవరాయలు, ఇలా ఒక్కటేమిటీ చరిత్రకు ఆధారం గ్రంథాలని చెప్పవచ్చు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యంలో భాగంగా 33 జిల్లాలుగా తెలంగాణ అవతరించింది. ఫలితంగా భౌగోళిక స్వరూపంలో పూర్తిగా మార్పు వచ్చింది. ఇందులో భాగంగానే కొత్త జిల్లాల వారీగా సాహిత్య సాంస్కృతికోత్సవాల పేరిట గ్రంథాలను ముద్రించాలని తెలంగాణ సారస్వత పరిషత్‌ సంకల్పించింది. మొదటి దశలో జిల్లాకో కన్వీనర్‌ని ఎంపిక చేసి...కవులు, రచయితలు, పండితులతో సమాలోచన చేస్తోంది.

తెలంగాణ కశ్మీరం: ప్రధానంగా చారిత్రక, భౌగోళిక, సాహిత్యం, కళలు, ఉద్యమాలు, పురాతన కట్టడాలు, ప్రముఖులు వంటి అన్ని కోణాల్లో పుస్తకాలు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. నిష్పక్షపాతంగా అన్ని కోణాలను స్పృశించిన తర్వాత అక్షరీకరణచేసి గ్రంథాలను ముద్రించేందుకు సారస్వత పరిషత్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం రెండోదశగా ప్రతి జిల్లాకో సదస్సును ఏర్పాటుచేసి పుస్తకాలను జనంలోకి తీసుకురావాలని సంకల్పించింది. ఇప్పటికే తెలంగాణ కశ్మీరంగా పేరొందిన ఆదిలాబాద్‌ జిల్లాలో ఆ దిశగా కవులు, రచయితలు సమాలోచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

"దాదాపు 30, 32 అంశాలకు సంబంధించి వ్యాసాలు ఉంటాయి. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు, భౌగోళిక స్వరూపం, ప్రాచీన చరిత్ర, కట్టడాలు ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యాసాలు రాయబోతున్నాం. ఆ వ్యాసాలన్నిటితో ఓ పుస్తకం రాబోతుంది." -మన్నె ఏలియా, సాంస్కృతికోత్సవ కన్వీనర్​

"ఎవరెవరు ఏయే అంశాలు రాయాలి. ఎవరికి ఏ విషయంపై సాధికారికత ఉందో ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాతే ప్రక్రియ ప్రారంభిస్తాం. త్వరలోనే ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన సమగ్రమైన చరిత్రను ప్రజల ముందుకు తీసుకువస్తాం." -మురళీధర్​ రావు, నవలా రచయిత

"33 జిల్లాలు ఏర్పటయ్యాక... ప్రతి జిల్లాకు నైసర్గిక స్వరూపం మారిపోయింది. ఆయా జిల్లాల్లోని కళలు, సంస్కృతి, అక్కడ ఉన్న ప్రత్యేకతలను అక్షర నిక్షిప్తం చేసే ఉద్యమంలో భాగంగా.. సారస్వత పరిషత్​ ఇలాంటి ఆలోచన చేయడం అభనందనీయం." -మధుసూధన్​, ప్రముఖ రచయిత

భవిష్యత్​ దిక్సూచి: నూతనంగా వచ్చే ఈ గ్రంథాలు భవిష్యత్‌ దిక్సూచిగా నిలుస్తాయనే మాట రచయితలనుంచి వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో అన్ని అంశాలు క్రోడీకరించిన తర్వాత ఒక్కో రచయిత 6 పేజీలు మించకుండా రచనలు చేయాలనేది సారస్వత పరిషత్‌ నిబంధనగా విధించింది. పుస్తకాలు అందుబాటులోకి వస్తే ఇవే కొత్త జిల్లాల సమగ్ర స్వరూపాలుగా నిలిచే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: గవర్నర్​ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్​.. ఏమన్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.