ETV Bharat / state

ఎనభై ఏళ్ల వయసులో యోగాతో అదరగొడుతున్న బామ్మ

ఆమెకు ఎనభై ఏళ్లు. ఇతరుల సాయం లేనిదే అడుగు తీసి అడుగు వేయలేదు. అనారోగ్యంతో ఏడాది క్రితమే కాలం చేస్తుందనుకున్నారు కుటుంబసభ్యులు. కానీ ఇప్పుడు ఆ వృద్ధురాలి హుషారు చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. ఆశలు వదిలేసుకున్న వేళ అనూహ్యంగా కోలుకున్న బామ్మను చూసి మురిసిపోతున్నారు. ఏడాదిగా నిత్యం యోగాసనాలు, ధ్యానం చేయడం వల్లే.... బామ్మ కోలుకుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బామ్మ కౌసల్యపై ప్రత్యేక కథనం...

80 years old women doing yoga in adilabad district
ఎనభై ఏళ్లు వయసులో యోగాతో అదరగొడుతున్న బామ్మ
author img

By

Published : Jun 21, 2020, 3:22 AM IST

Updated : Jun 21, 2020, 7:42 AM IST

ఈమె ఆదిలాబాద్‌ జిల్లా జందాపూర్‌ గ్రామానికి చెందిన శాబంతుల కౌసల్య. తొమ్మిది మంది సంతానంలో ముగ్గురు పుట్టగానే చనిపోయారు. మిగతా వారందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఏడాది క్రితం కౌసల్య ఆరోగ్యం క్షీణించి మూడు నెలలు పాటు మంచానికే పరిమితమైపోయింది. ఇతరుల సాయం లేనిదే లేచి కూర్చోలేని పరిస్థితి. తిండి మానేయడం వల్ల ఓ దశలో ఆమెపై కుటుంబసభ్యులు ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఏడాది వ్యవధిలోనే అనూహ్యంగా ఆమె కోలుకున్న తీరు వారిని ఆశ్చర్యపరిచింది. సొంతంగా తన పనులు చేసుకోవడంతో పాటు హుషారుగా ఇంటి పనులు సైతం చేస్తూ ఔరా అనిపిస్తోంది. తన మనవడి సహకారంతో యోగా, ధ్యానం చేయడం ప్రారంభించిన కౌసల్య..... ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటూ అవలీలగా వేస్తున్న ఆసనాలు అబ్బురపరుస్తున్నాయి.

ఉదయం 4గంటలకే నిద్రలేవడం

రోజూ ఉదయం 4గంటలకే నిద్రలేచే ఈ బామ్మ.... గంట సేపు యోగ చేసిన తర్వాతే దైనందిన పనులకు ఉపక్రమిస్తుంది. మాంసం అంటే రుచి ఎరగని బామ్మ.... శాఖాహారం తప్ప వేరేవి తీసుకోదు. ఎనభై ఏళ్లొచ్చినప్పటికీ ఏనాడు కళ్లద్దాలు ధరించే అవసరం రాలేదంటారామె. ధ్యానముద్రతో మొదలయ్యే ఆసనాలు... గ్రైండింగ్‌, హలాసనం, మండుకాసం, సర్వాంగాసనం, పాదముక్తాసనం, గరుడాసనం, చక్రాసనం... ఇలా పదిహేను రకాల ఆసనాలను అలుపెరగకుండా చేస్తుంది. యోగా చేయడం ఆరంభించినప్పటి నుంచి ఏనాడు ఆసుపత్రి వైపు చూడలేదంటారు బామ్మ. తన మనవడు నేర్పిన యోగసనాలు చేస్తూ ఆనందంగా ఉంటున్నానని చెబుతున్నారు.

అందరికీ ఆదర్శంగా

ఆరేళ్లుగా యోగాసనాలు చేయడంలో ఆరితేరిన ప్రవీణ్‌... నిత్యం బామ్మతో యోగాసనాలు చేయిస్తూ ఆమె అనారోగ్యాన్ని పటాపంచలు చేశాడు. ధ్యానం, ఆసనాలు చేయడం ప్రారంభించాక బామ్మ ఆరోగ్యం మరింత కుదుటపడిందని తను సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. జబ్బులు, మానసిక రుగ్మతలకు చక్కటి ఔషధం... యోగా, ధ్యానం. అనారోగ్యం బారి నుంచి అనతి కాలంలోనే అద్భుతంగా కోలుకున్న బామ్మ కౌసల్య జీవితం.... నేటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి: ఇంటి పన్ను చెల్లించలేదని టీవీ ఎత్తుకెళ్లారు.

Last Updated : Jun 21, 2020, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.