ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉదయం చిన్నారుల వార్డులో వారికి ఇచ్చిన సూదిమందు వికటించి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబ వ్యక్తులు ఈ విషయాన్ని వైద్యులకు చేరవేయడంతో... అస్వస్థతకు గురైన చిన్నారులను హుటాహుటిన ప్రత్యేక విభాగానికి తరలించారు.
ప్రస్తుతం పది మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు.
ఇదీ చూడండి: రేపు మేడారానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్