Animals died in container: ఆదిలాబాద్ జిల్లా ఇచోడ మండలంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. పరిమితికి మించిన పశువులతో తరలిస్తున్న లారీ కంటైనర్ బోల్తా పడి... 10 పశువులు మృతి చెందాయి. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా సాత్ నంబర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తరువాత అందులోని వారు పరారయ్యారు.

బోల్తా పడిన లారీని... గమనించిన స్థానికులు కంటైనర్ తలుపులు పగులగొట్టగా.. 60 పశువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని బయటకు తీసుకొచ్చారు. 50 బయటకు రాగా.. వాటిలో కొన్నిటికి గాయాలయ్యాయి. 10 మూగజీవాలు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గాయపడిన వాటికి ఇచోడ పశు వైద్యశాలలో చికిత్స అందించి.. గోశాలకు తరలించారు.
ఇవీ చదవండి: KTR on MLA Dharmareddy: 'ఎమ్మెల్యే ధర్మారెడ్డి.. ఓ స్వాతిముత్యం'
'హైదరాబాద్లో దమ్ బిర్యానీ తిని వెళ్లడమే తప్ప.. వాళ్లు గెలిచేది లేదు'