ETV Bharat / sports

Olympics: బజరంగ్​ పునియాకు కాంస్యం- భారత్​కు ఆరో పతకం

author img

By

Published : Aug 7, 2021, 4:25 PM IST

Updated : Aug 7, 2021, 4:52 PM IST

BAJARANG PUNIA
బజరంగ్​ పునియా

16:21 August 07

బజరంగ్​ పునియాకు కాంస్యం- భారత్​కు ఆరో పతకం

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు మరో పతకం లభించింది. రెజ్లింగ్​ పురుషుల ఫ్రీస్టైల్​ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో గెలిచాడు టాప్​ రెజ్లర్​ బజరంగ్​ పునియా. ఈ కాంస్యంతో.. ప్రస్తుత ఒలింపిక్స్​లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది.  

కజకిస్థాన్​కు చెందిన నియాజ్​బెకోవ్​ దౌలెత్​ను 8-0 తేడాతో చిత్తుచేశాడు బజరంగ్​.

ఎన్నో అంచనాలతో ఫేవరేట్​గా టోక్యో బరిలో దిగిన బజరంగ్​ పునియా.. సెమీఫైనల్లో అజర్​బైజాన్​కు చెందిన అలియెవ్​ హజీ చేతిలో 5-12 తేడాతో అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. అయినా.. ఇప్పుడు కంచు పట్టి భారత్​ గర్వించేలా చేశాడు.

లండన్​ను దాటేనా..?

2012 లండన్​ ఒలింపిక్స్​లో భారత్​ ఆరు పతకాలు సాధించింది. ఇప్పుడు టోక్యోలో కూడా.. అన్నే పతకాలు సాధించింది. అథ్లెటిక్స్​లో నీరజ్​ చోప్రా పతకం సాధిస్తే.. లండన్​ను దాటనుంది భారత్​.

ఇదీ చూడండి: అదితి అద్భుత ప్రదర్శన.. కానీ!

Last Updated : Aug 7, 2021, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.