హాకీ మ్యాచ్ నిర్వాహకులు ఆట ప్రారంభానికి ముందు పిచ్‌ను నీటితో తడుపుతారు. ఎందుకంటే 1970 నుంచి హాకీ మ్యాచ్‌ల్లో బంతి తీవ్రతను తగ్గించడం సహా ఆటగాళ్లకు గాయాలు కాకుండా కృత్రిమ పిచ్‌ను వినియోగిస్తున్నారు. బంతి బౌన్స్ కాకుండా, అలాగే దానిపై ఉండే షీల్డ్ కోటింగ్ పోకుండా ఇది సహాయపడుతుంది.
1970కి ముందు హాకీ కోసం ఇసుక మైదానాలను వినియోగించేవారు. వీటి నిర్వహణ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వేసవి కాలంలో వీటిపై తరచుగా నీటిని వెదజల్లాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇసుక పిచ్‌ల నిర్వహణలో నీటి ఖర్చు ఎక్కువగా జరిగేది. అలాగే.. ఇసుక మైదానాల్లో ఆడితే ఆటగాళ్లు ఎక్కువగా గాయాలబారిన పడేవారు.
అత్యుత్తమ పిచ్..
హాకీ పిచ్‌పై నిజమైన గడ్డి స్థానంలో సింథటిక్ ఫైబర్‌ను పరచడం ద్వారా నీటి వినియోగం తగ్గించినట్లు అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) కోసం 60 శాతం చెరకుతో తయారు చేసిన సింథటిక్ పిచ్‌ను వాడుతున్నారు. దీనివల్ల గత ఒలింపిక్స్‌తో పోలిస్తే ప్రస్తుతం 1/3 వంతు నీటిని వినియోగిస్తున్నారు. ఇలాంటి పిచ్‌ల వల్ల ఆటగాళ్లు గాయాల బారిన పడే అవకాశమే లేదు.
ఇదీ చూడండి.. 'మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం'.. హాకీ జట్టుకు అభినందనల వెల్లువ