టోక్యో ఒలింపిక్స్ సంబరాల్లో మునిగి తేలాక రెండు వారాలు విరామం తీసుకున్న క్రీడాభిమానుల కోసం ఇంకో ఆటల పండుగ మొదలైంది. అదే టోక్యోలో మరో విశ్వ క్రీడా సంబరం మొదలైంది. 16వ పారాలింపిక్స్(Tokyo Paralympics 2020)కు మంగళవారమే శ్రీకారం చుట్టారు. ఆరంభ వేడుకలకు జపాన్ చక్రవర్తి నరుహిటో, ప్రధాని సుగా హాజరయ్యారు. వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదని చాటుతూ 163 దేశాలకు చెందిన 4500 మంది పారా అథ్లెట్లు పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అందులో భారత యోధులు 54 మంది ఉన్నారు.
పారాలింపిక్స్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత పెద్ద జట్టుతో, భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న భారత బృందానికి తొలిరోజు ఏ పోటీలు జరగలేదు. బుధవారం నుంచి వీరు బరిలో దిగనున్నారు. టేబుల్ టెన్నిస్‌తో భారత బృందం తమ పోటీలను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత ఆటగాళ్ల షెడ్యూల్ చూద్దాం.
టేబుల్ టెన్నిస్
విభాగం: ఉమెన్స్ సింగిల్స్ క్లాస్ 3, గ్రూప్ డీ
అథ్లెట్ - సోనమ్ పటేల్
సమయం - ఉదయం 7.30 గంటలకు
విభాగం: ఉమెన్స్ సింగిల్స్ క్లాస్ 4, గ్రూప్ ఏ
అథ్లెట్ - భవినా పటేల్
సమయం - ఉదయం 8.50 గంటలకు