ETV Bharat / sports

భారత రెజ్లింగ్​ను దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్​ - రెజ్లింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా

భారత రెజ్లర్లకు అండగా నిలిచేందుకు ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం ముందుకొచ్చింది. 2032 ఒలింపిక్స్​ వరకు భారత రెజ్లింగ్​కు స్పాన్సర్​గా వ్యవహరించేందుకు అంగీకారం తెలిపింది. ఇందుకోసం రూ.170 కోట్లు ఖర్చు పెట్టునుంది!

UP government adopts Indian wrestling till 2032 Olympics
భారత రెజ్లింగ్​ను దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్​
author img

By

Published : Aug 27, 2021, 6:38 AM IST

భారత రెజ్లింగ్‌కు మంచి రోజులొచ్చాయి. కుస్తీకి అండగా నిలవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్‌ వరకు భారత రెజ్లింగ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. హాకీకి ఒడిశా ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లే రెజ్లింగ్‌ను యూపీ ప్రభుత్వం దత్తత తీసుకుంది. 2032 వరకు మౌలిక వసతులు, రెజ్లర్ల శిక్షణ కోసం సుమారు రూ.170 కోట్లు ఖర్చు పెట్టనుంది.

"ఒడిశా చిన్న రాష్ట్రం. అయినా హాకీకి గొప్పగా మద్దతు ఇస్తుంది. ఇంత పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌ అలాంటి పని ఎందుకు చేయకూడదు అని అనిపించింది. ప్రభుత్వాన్ని సంప్రదించాం. మా ప్రతిపాదనకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆమోదం తెలిపారు"

- బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు

మరోవైపు క్రమశిక్షణ రాహిత్యం కారణంగా సస్పెన్షన్‌కు గురైన వినేశ్‌ ఫొగాట్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ మందలింపుతో విడిచిపెట్టింది. సోనమ్‌ మలిక్‌, దివ్య కక్రన్‌లకు హెచ్చరికలతో సరిపెట్టడం వల్ల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఈ ముగ్గురికి మార్గం సుగమమైంది.

ఇదీ చూడండి.. 'పాక్​ ఆటగాడు నా జావెలిన్​ తీసుకుంటే తప్పేంటి?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.