ETV Bharat / sports

అయ్యో తుపాకీ.. ఎంత పని చేశావ్‌! - ఒలింపిక్స్​లో భారత షూటర్లు

'గురి' కుదరలేదు. 'తుపాకీ' ఇంకా పేలలేదు. పతకం కాదు.. పతకాలు గెలుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్లు వరుసగా రెండో రోజూ తీవ్ర నిరాశకు గురిచేశారు. షూటింగ్‌ బృందంలో అత్యధిక అంచనాలతో బరిలోకి దిగిన మను బాకర్‌ను 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో దురదృష్టం వెంటాడింది. తుపాకీలో సాంకేతిక లోపం తలెత్తి దాదాపు 20 నిమిషాల సమయం వృథా అయింది. అయినప్పటికీ ఆమె పోరాడినా.. త్రుటిలో ఫైనల్‌ బెర్తు చేజారింది. దీంతో ఓ పతకం చేజేతులా కోల్పోయినట్లయింది.

pistol failed of manu bhaker
మను బాకర్​ తుపాకీ
author img

By

Published : Jul 26, 2021, 7:01 AM IST

ఒలింపిక్స్‌లో షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ ఈ క్రీడలో పతకం దక్కలేదు. కచ్చితంగా పతకం వస్తుందనుకున్న 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో మను బాకర్‌తో పాటు యశస్విని సింగ్‌ దేశ్వాల్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మను, యశస్విని వరుసగా 575, 574 పాయింట్లతో 12, 13 స్థానాలకు పరిమితం అయ్యారు. 577 పాయింట్లు సాధించిన ఫ్రాన్స్‌ షూటర్‌ గోబర్‌విల్లీ ఎనిమిదో స్థానంతో చివరి ఫైనల్‌ బెర్తును సొంతం చేసుకుంది. అయితే ఫైనల్‌ చేరనందుకు మనును నిందించడానికి లేదు. తన పిస్టల్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా 20 నిమిషాల విలువైన సమయాన్ని ఆమె కోల్పోయింది. అయినా సరే.. మిగతా షూటర్లతో సమానంగా పోటీ పడి ఫైనల్‌ అర్హత మార్కుకు కేవలం రెండు పాయింట్ల దూరంలో ఆగిపోయింది.

ఆ సమయం వృథా కాకుంటే మను సులభంగా ఫైనల్‌కు చేరేదే. అంత ఒత్తిడిలోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసిన మను.. సాధారణ స్థితిలో కచ్చితంగా పతకం గెలిచేదేమో. మను వరుసగా ఆరు సిరీస్‌ల్లో 98, 94, 94, 95, 98, 95 పాయింట్లు సాధించింది. ఆమె '10'లు 14 వేసింది. యశస్విని వరుసగా 94, 95, 94, 95, 98, 95 పాయింట్లు సాధించింది. ఆమె '10'లు పదకొండే. ఈ ఈవెంట్లో రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ) క్రీడాకారిణి బత్సరస్కినా స్వర్ణం గెలవగా.. కొస్తదినోవా (బల్గేరియా) రజతం, జియాంగ్‌ రాన్‌జిన్‌ (చైనా) కాంస్యం నెగ్గారు. ఆదివారం పురుష షూటర్లు మరింతగా నిరాశ పరిచారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ అర్హత రౌండ్లో దీపక్‌ కుమార్‌, దివ్యాంశ్‌ పేలవ ప్రదర్శనతో వరుసగా 26, 32 స్థానాల్లో నిలిచారు. దీపక్‌ 624.7 పాయింట్లు సాధించగా.. దివ్యాంశ్‌ 622.8 పాయింట్లకు పరిమితం అయ్యాడు. పురుషుల స్కీట్‌ క్వాలిఫయింగ్‌లో అంగద్‌ వీర్‌ సింగ్‌ మూడు రౌండ్లు ముగిసేసరికి 11వ స్థానంలో నిలిచాడు. సోమవారం మిగతా రెండు రౌండ్లు జరుగుతాయి. ఇదే విభాగంలో మైరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ 25వ స్థానానికి పరిమితమయ్యాడు.

చిరునవ్వుల కోసం ఓ 30 సెకన్లు..

ఒలింపిక్స్‌లో పోటీ పడడమే గొప్ప విషయం. అందులో పతకం నెగ్గడమంటే అథ్లెట్‌ జీవితకాల స్వప్నం నెరవేరినట్లే! కానీ కరోనా మహమ్మారి కారణంగా ఎవరితోనూ కలిసి సంబరాలు చేసుకునే అవకాశమే లేకపోయింది. కనీసం.. పతకం అందుకున్న సమయంలో చిరునవ్వులు చిందిస్తూ ఓ ఫొటో అయినా తీసుకోవడానికి వీల్లేకపోయింది. అభిమానులకూ వారి భావోద్వేగాలు కనిపించట్లేదు. ఆడే సమయంలో తప్ప అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులూ ఎల్లప్పుడూ మాస్కులు ధరించే ఉండాలన్న నిబంధనే అందుకు కారణం.

ఈ నిబంధనలు మన మీరాబాయి చాను సహా పతక విజేతలు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో ఐఓసీ మాస్కు నిబంధనల్లో మార్పులు చేసింది. పతక విజేతలు పోడియం వద్ద ఫొటోల కోసం 30 సెకన్ల పాటు మాస్కులు తీయడానికి తాజాగా అనుమతి ఇచ్చింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.