టోక్యో పారాలింపిక్స్(Tokyo Paralympics)లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. శుక్రవారం పురుషుల హైజంప్ టీ64 విభాగంలో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్(Praveen Kumar High jump) రజతం సాధించాడు.
2.07మీటర్ల ఎత్తుకు జంప్ చేసి రజతం సొంతం చేసుకున్నాడు ప్రవీణ్(Praveen Kumar Paralympics). గ్రేట్ బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డ్ జోనాథన్ 2.10మీటర్ల ఎత్తును ఛేదించి స్వర్ణం సాధించాడు. రియో గేమ్స్ ఛాంపియన్ మసైజ్ లెపియాటో 2.04 మీటర్ల ఎత్తుతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
భారత్ తరఫున పతకం సాధించిన ప్రవీణ్‌కు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.
"పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ప్రవీణ్ కుమార్‌కు శుభాకాంక్షలు. ఈ పతకం ప్రవీణ్ కృషి, అంకితభావానికి ప్రతిఫలం. భవిష్యత్తులో ప్రవీణ్ మరింత గొప్పగా రాణించాలి."
-నరేంద్ర మోదీ, ప్రధాని.
11 పతకాలు..
ఈ రజతంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది. అందులో 2 స్వర్ణ పతకాలు కాగా.. 6 రజతం, 3 కాంస్య పతకాలున్నాయి.