పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఓటమితో తమ ప్రస్థానం ఆరంభించారు. ప్యాడ్లర్లు భావినాబెన్ పటేల్, సోనాల్‌బెన్ మనుభాయి పటేల్ తొలి రౌండ్లలో ఓటమి పాలయ్యారు.
మహిళల క్లాస్-3 విభాగంలో పోటీపడ్డ సోనాల్‌బెన్ మొదటి మూడు గేముల్లో ఆధిపత్యం చలాయించింది. కానీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక పోయింది. 11-9, 3-11, 17-15, 7-11, 4-11 తేడాతో చైనా క్రీడాకారిణి లీ క్వాన్ చేతిలో ఓటమి పాలైంది. లీ ప్రపంచ నాలుగో ర్యాంకరే కాకుండా రియోలో రజత పతక విజేత కావడం గమనార్హం.
ఇక మహిళల క్లాస్-4 విభాగం తొలి పోరులో భావినాబెన్‌కు సైతం చైనా అమ్మాయి చేతిలోనే ఓటమి ఎదురైంది. ప్రపంచ నంబర్ వన్, జౌయింగ్ చేతిలో 3-11, 9-11, 2-11 తేడాతో ఓటమి పాలైంది. క్లాస్-3తో పోలిస్తే క్లాస్-4 విభాగంలో వైకల్యం శాతం ఎక్కువ.
ఇవీ చదవండి: