టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను.. బంగారు పతకం వచ్చే అవకాశాల్లేవు. 49 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిన చైనా వెయిట్ లిఫ్టర్ జిహుయ్ హౌకు డోపింగ్ టెస్టులు చేయనున్నారని, అందులో పాజిటివ్‌గా తేలితే మీరాకు స్వర్ణం దక్కుతుందని ఇటీవల వార్తలొచ్చాయి.
![Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12619436_mira.jpg)
ఇదీ చూడండి: మీరాబాయి చానుకు 'స్వర్ణా'వకాశం!
అయితే.. ఇందులో నిజం లేదని అధికారులు తేల్చారు. అది పొరపాటుగా జరిగిందని, డోప్ టెస్టుల గురించి ప్రస్తావనే రాలేదని తెలిసింది.
ఫైనల్లో.. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో 210 కేజీల బరువును ఎత్తి కొత్త ఒలింపిక్స్ రికార్డును సృష్టించింది చైనా రెజ్లర్ జిహుయ్ హౌ.
![Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12619436_dr-2.jpg)
![Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12619436_dr.jpg)
రెండో స్థానంలో నిలిచి..
మీరాబాయి 202 కేజీలను ఎత్తి.. రజతం గెల్చింది. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇదే తొలి రజత పతకం. ఈ ఒలింపిక్స్‌లో తొలి పతకం కూడా మీరానే సాధించడం విశేషం.
![Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12619436_drj.jpg)
అంతకుముందు.. ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి కాంస్యం సాధించింది.
రజతం సాధించిన మీరాబాయి చాను స్వదేశానికి చేరుకుంది. విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. కేంద్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం కూడా జరిగింది.
![Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12619436_drs.jpg)
![Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12619436_mirab.jpg)
ఇదీ చూడండి: నిరాడంబరతకు నిలువుటద్దం ఈ 'మణిపూస'