ETV Bharat / sports

మీరాబాయి చానుకు 'స్వర్ణా'వకాశం!

టోక్యో ఒలింపిక్స్​లో రజతంతో మెరిసింది మీరాబాయి చాను. అయితే ఇప్పుడు ఈ రెజ్లర్​కు స్వర్ణ పతకం దక్కే అవకాశం ఉంది.

mirabai chanu
మీరాబాయి చాను
author img

By

Published : Jul 26, 2021, 2:58 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో రజతంతో మెరిసిన మీరాబాయి చాను ఆనందం డబుల్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఈ వెయిట్​లిఫ్టర్​కు గోల్డ్​ దక్కే అవకాశముంది!

స్నాచ్​, క్లీన్​ అండ్ జెర్క్​ విభాగాల్లో 210 కేజీల బరువును ఎత్తి కొత్త ఒలింపిక్స్​ రికార్డును సృష్టించింది చైనా రెజ్లర్​ జిహుయ్ హౌ. అయితే ఆమెను యాంటీ డోపింగ్ అధికారులు పరీక్షించనున్నారు. అప్పటివరకు ఆమెను ఒలింపిక్​ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించారు. ఒకవేళ ఆమె డోపీగా తేలితే హౌ పతకాన్ని వెనక్కి తీసుకుంటారు. ఇలా.. రెండో స్థానంలో ఉన్న చానుకు గోల్డ్​ మెడల్​ దక్కే అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న ఇండోనేసియా రెజ్లర్​కు రజతం దక్కే అవకాశం ఉంది.

స్నాచ్​లో 84 కేజీలతో పాటు క్లీన్ అండ్ జెర్క్​ విభాగంలో 115 కేజీల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచింది చాను. దీంతో ఆమెకు రజతం దక్కింది. విండీ కంటిక ఐసా(ఇండోనేసియా) 194 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి: శిష్యురాలికి గోల్డ్​ మెడల్​- గంతులేసిన కోచ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.