ETV Bharat / sports

'నాకౌట్​ పోరు సులభమేమీ కాదు.. బ్లిచ్​ఫెల్ట్​తో కష్టమే'

ఒలింపిక్స్​ ప్రీ క్వార్టర్స్​ ప్రత్యర్థి బ్లిచ్​ఫెల్ట్​తో మ్యాచ్​ అంత సులువు కాదని అభిప్రాయపడింది భారత షట్లర్​ పీవీ సింధు. రెండో రౌండ్​లో గెలుపొందిన అనంతరం నాకౌట్​ మ్యాచ్​పై స్పందించింది. దూకుడుగా ఆడితేనే ఆమెతో పోరులో పైచేయి సాధించవచ్చని స్పష్టం చేసింది.

PV Sindhu, Tokyo Olympics
పీవీ సింధు, టోక్యో ఒలింపిక్స్
author img

By

Published : Jul 28, 2021, 5:17 PM IST

టోక్యో ఒలింపిక్స్‌ నాకౌట్‌ దశ సులభమేమీ కాదని భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు తెలిపింది. ప్రీ క్వార్టర్స్‌లో బ్లిచ్‌ఫెల్ట్‌తో పోరు కఠినంగానే సాగుతుందని అంచనా వేసింది. రెండో రౌండ్‌ మ్యాచులో తన లయ అందుకున్నానని వెల్లడించింది. నాకౌట్లో అడుగుపెట్టిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. గ్రూప్‌ దశ రెండో మ్యాచులో హాంకాంగ్‌కు చెందిన చెయింగ్‌ను ఆమె వరుస గేముల్లో ఓడించింది.

"రెండో గేమ్‌లో నా లయ అందుకున్నా. మ్యాచును ముగించా. ఆట వేగంగా సాగింది. నేను కొన్ని అనవసర తప్పిదాలు చేశా. వ్యూహాలు మార్చి పరిస్థితులను నియంత్రించా. పెద్ద మ్యాచులకు ముందు ఇలాంటి పరీక్షలు అత్యంత కీలకం" అని సింధు తెలిపింది.

తర్వాతి మ్యాచులో తలపడే బ్లిచ్‌ఫెల్ట్‌పై సింధుకు 4-1 ఆధిక్యం ఉంది. ఐతే ఆమెతో పోరు సులువు కాదని ఈ తెలుగుతేజం అంటోంది. "తొలి నాకౌట్‌ మ్యాచ్‌ అంత సులభమేమీ కాదు. త్వరగా కోలుకొని బలంగా పుంజుకోవాలి. నేనామెతో కొన్ని మ్యాచుల్లో తలపడ్డాను. ప్రతి పాయింటు ముఖ్యమే. ఆమె దూకుడుగా ఆడుతుంది. కాబట్టి నేనూ అలాగే ఆడాలి" అని సింధు వెల్లడించింది. క్వార్టర్స్‌లో అకానె యమగూచి, సెమీస్‌లో తైజు ఇంగ్‌తో సింధు తలపడాల్సి రావొచ్చు.

ఇదీ చదవండి: 'ఈ వేడికి నేను చనిపోతే.. మీరు బాధ్యత వహిస్తారా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.