టోక్యో ఒలింపిక్స్‌లోని బాక్సింగ్ మహిళల ప్రీ క్వార్టర్స్‌లో ఓడి.. ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్. మూడు రౌండ్ల బౌట్లో రెండింట్లో గెలిచినా.. ఆమె ఓటమి పాలైంది. దీనిపై మేరీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తానే గెలిచినట్లు అనుకున్నానని, తనకు అన్యాయం జరిగిందని తెలిపింది.
![Mary Kom surprised after being asked to change jersey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12617808_43.jpg)
ఇప్పుడు ఆమె చేసిన మరో ట్వీట్‌తో.. మేరీ కోమ్కు అన్యాయం జరిగినట్లే అనిపిస్తోంది. బౌట్‌కు నిమిషం ముందు.. తన రింగ్ డ్రెస్ మార్చుకోమన్నారని, ఇది ఆశ్చర్యంగా అనిపించిందని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ ట్వీట్‌కు పీఎంఓ ఇండియా, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకుర్, కిరణ్ రిజిజు, @ఒలింపిక్స్ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేసింది.
''ఆశ్చర్యమేస్తోంది.. అసలు రింగ్ డ్రెస్ అంటే ఏంటో ఎవరైనా చెబుతారా? నా ప్రీక్వార్టర్స్ బౌట్‌కు నిమిషం ముందు.. నా రింగ్ డ్రెస్‌ను మార్చుకోవాలని చెప్పారు. ఎందుకో ఎవరైనా చెబుతారా?''
- ట్విట్టర్లో మేరీ కోమ్, భారత బాక్సర్
మ్యాచ్ సందర్భంగా ధరించిన జెర్సీపై మేరీ కోమ్ అని ఉండగా.. మొదటి పేరు మాత్రమే ఉండాలని చెప్పారు నిర్వాహకులు. ఆ తర్వాత ఆమెకు పేరు లేని(బ్లాంక్ జెర్సీ) జెర్సీ ఇచ్చారు. కానీ.. బౌట్‌కు నిమిషం ముందు ఇలా చేయడంపై ప్రశ్నించింది భారత దిగ్గజ బాక్సర్. ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలా చేశారని నెటిజన్లు.. మేరీకి మద్దతుగా నిలుస్తున్నారు.
![Mary Kom surprised after being asked to change jersey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12617808_1.jpg)
ప్రీక్వార్టర్స్‌లో కొలంబియాకు చెందిన వాలెన్సియా చేతిలో 3-2 తేడాతో ఓడింది మేరీ కోమ్. ఈ బౌట్లో జడ్జిల నిర్ణయంపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది మేరీ కోమ్. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చూసే వరకు.. ఓడిన విషయం తనకు తెలియదని ఆమె చెప్పడం గమనార్హం.
![Mary Kom surprised after being asked to change jersey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12617808_4.jpg)
ఇదీ చూడండి: Tokyo Olympics: ప్రీక్వార్టర్స్‌లో మేరీకోమ్ ఓటమి