హాకీలో నిరాశ...
ఒలింపిక్స్లో భాగంగా మహిళల హాకీలో భారత్ శుభారంభం చేయలేకపోయింది. నెథర్లాండ్స్తో జరిగిన పోరులో విఫలమైంది. 5-1తో ఆ జట్టుపై భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. మ్యాచ్ ప్రారంభంలో నెథర్లాండ్స్కు గట్టిపోటీనిచ్చిన మహిళ జట్టు.. చివరి 30 నిమిషాల్లో చేతులెత్తేసింది. 2-1తో వెనకంజలో ఉన్నప్పటికీ, స్కోర్లను సమం చేస్తుందనే నమ్మకం అభిమానులకు కలిగింది. కానీ చివరికి 5-1తో ఓడిపోయింది.