ETV Bharat / sports

Tokyo Olympics: పాపం జకోవిచ్.. పతకం లేకుండానే! - టోక్యో ఒలింపిక్స్ జకోవిచ్ ఔట్

టెన్నిస్ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ టోక్యో ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించాడు. స్వర్ణం అంచనాలతో బరిలో దిగిన ఇతడు పతకం లేకుండానే ఇంటిముఖం పట్టాడు.

Djokovic
జకోవిచ్
author img

By

Published : Jul 31, 2021, 5:55 PM IST

Updated : Jul 31, 2021, 6:08 PM IST

కరోనా కారణంగా స్టార్ టెన్నిస్ ఆటగాళ్లు ఫెదరర్, నాదల్​తో పాటు డొమినిక్ థీమ్ టోక్యో ఒలింపిక్స్​లో ఆడబోమంటూ స్పష్టం చేశారు. కానీ పురుషుల నెంబర్​వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ మాత్రం తాను పాల్గొంటానని తెలిపాడు. దీంతో ఈసారి స్వర్ణం అతడికే అని అంతా అనుకున్నారు. గ్రూప్​ మ్యాచ్​ల్లో జకో ఆధిపత్యం చూసినవారికి కూడా అదే అనిపించింది. కానీ నాకౌట్ మ్యాచ్​లకు వచ్చేసరికి అంతా తారుమారైంది.

పతకం లేకుండానే!

ఈసారి ఒలింపిక్స్​తో పాటు యూఎస్ ఓపెన్ గెలిచి గోల్డెన్ స్లామ్ రికార్డు దక్కించుకుందామన్న జకోవిచ్​ ఆశ నెరవేరలేదు. టోక్యో విశ్వక్రీడల్లో సెమీ ఫైనల్ మ్యాచ్​లో జ్వెరెవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు జకో. దీంతో అతడి స్వర్ణం ఆశలు ఆవిరయ్యాయి. కనీసం కాంస్యం అయినా వస్తుందనుకుంటే అదీ లేదు. నేడు (శనివారం) కాంస్య పతకం కోసం పాబ్లో కారెన్నో బూస్టాతో జరిగిన మ్యాచ్​లోనూ ఓటమి చెందాడు. దాదాపు రెండు గంటల 45 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్​లో జకో 4-6, 8-6, 3-6 తేడాతో పరాజయం చెందాడు. అంతకుముందు, జకోవిచ్-నినా స్టాంకోవిచ్ జోడీ మిక్స్ డ్ డబుల్స్ కాంస్యం పోరు నుంచి గాయం కారణంగా తప్పుకొంది. దీంతో రిక్తహస్తాలతో ఒలింపిక్స్​ నుంచి తిరుగు ముఖం పట్టాడీ స్టార్ ప్లేయర్.

ఇటీవలే తన ఆరో వింబుల్డన్ టైటిల్ గెలిచిన జకో.. కెరీర్​లో 20 గ్లాండ్​స్లామ్​లతో స్విస్ దిగ్గజం ఫెదరర్, నాదల్​ సరసన చేరాడు. ఈ సీజన్​లో ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ దక్కించుకున్న సెర్బియన్ స్టార్.. ఒలింపిక్స్​లోనూ స్వర్ణమే లక్ష్యంగా బరిలో దిగాడు. కానీ నిరాశగా వెనుదిరిగాడు.

ఇవీ చూడండి: Tokyo Olympics: సెమీస్​లో సింధు ఓటమి.. స్వర్ణం ఆశలు ఆవిరి

Last Updated : Jul 31, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.