టోక్యో ఒలింపిక్స్లో రెండో పతకం కోసం భారత అథ్లెట్ల వేట కొనసాగుతోంది. విశ్వక్రీడలు మొదలైన రెండో రోజునే వెయిట్ లిఫ్టర్ మీరాబాయి రజత పతకం సాధించగా.. ఇప్పుడు టోర్నీ 7వ రోజుకు చేరుకున్నా రెండో పతకం కోసం భారత ప్రేక్షకులు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. గురువారం జరగనున్న పోటీల్లో స్టార్ అథ్లెట్లు పోటీ పడనున్నారు. వీరి ప్రదర్శనతోనైనా భారత్కు మరో పతకం వస్తుందేమో చూడాలి.
టోక్యో ఒలింపిక్స్ ఏడో రోజున(జులై 29) భారత అథ్లెట్లు పాల్గొననున్న క్రీడలు.. వాటి వివరాలు..
రోయింగ్:
ఉదయం 5.20 గంటలకు మెన్స్ డబుల్ స్కల్స్ ఫైనల్ బీ. భారత అథ్లెట్లు అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ పాల్గొంటారు.
గోల్ఫ్:
ఉదయం 5.22 గంటలకు మెన్స్ రౌండ్ 1. భారత అథ్లెట్ అనిర్బాన్ లాహిరి పాల్గొంటారు.
ఉదయం 7. 39 గంటలకు మెన్స్ రౌండ్ 1. ఉదయన్ మనె పాల్గొంటాడు.
షూటింగ్:
ఉదయం 5.30 గంటలకు ఉమెన్స్ 25మీ పిస్టోల్ క్వాలిఫికేషన్ మ్యాచ్. రహి సర్నాబాట్, మను బాకర్ పాల్గొంటారు.
హాకీ:
ఉదయం 6 గంటలకు పురుషుల హాకీ జట్టు, అర్జెంటినాతో తలపడుతుంది.
బ్యాడ్మింటన్:
ఉదయం 6.15 గంటలకు ఉమెన్స్ సింగిల్స్ రౌండ్ 16లో పీవీ సింధు అమీతుమీ తేల్చుకోనుంది.
ఆర్చరీ:
ఉదయం 7.31 గంటలకు పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్స్. భారత అథ్లెట్ అతాను దాస్ పాల్గొంటాడు.
సెయిలింగ్:
ఉదయం 8.35 గంటలకు మెన్స్ లేజర్ రేస్ రేడియల్ రేస్ 7& 8. విష్ణు సరవనన్ పాల్గొంటాడు. 49 మెన్స్ రేస్ 5& 6లో కేసీ గణపతి, వరుణ్ థక్కర్ పాల్గొననున్నారు.
ఉదయం 8.45 గంటలకు ఉమెన్స్ లేజర్ రేడియల్ రేస్ 7& 8. నేథ్రా కమనన్ పాల్గొననుంది.
బాక్సింగ్:
8.48 గంటలకు ప్రిలిమ్స్ రౌండ్ 16- మెన్స్ 91 కేజీ. సతీష్ కుమార్ పాల్గొంటాడు.
మధ్యాహ్నం 3.36 గంటలకు ప్రిలిమ్స్ ఉమెన్స్ రౌండ్ 16.. 51 కేజీ. మేరీ కోమ్ పాల్గొంటుంది.
స్విమ్మింగ్:
సాయంత్రం 4.16 గంటలకు మెన్స్ 100మీ బట్టర్ఫ్లై హీట్ 2. సజన్ ప్రకాశ్ పాల్గొంటాడు.
ఇదీ చదవండి: