ETV Bharat / sports

సింధు, మను, అతాను జోరు- హాకీ, బాక్సింగ్​లో క్వార్టర్స్​కు.. - 25 m. air pistol

భారత క్రీడాకారులు.. ఒలింపిక్స్​లో గురువారం స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. తలపడిన అన్ని క్రీడల్లో పతక ఆశలు కలిగిస్తున్నారు. బ్యాడ్మింటన్​లో పీవీ సింధు, బాక్సింగ్​లో సతీశ్​ కుమార్​ క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించారు. మరొక్క మ్యాచ్​ గెలిస్తే.. సతీశ్​కు పతకం ఖాయం. హాకీలో మెన్​ ఇన్​ బ్లూ దాదాపు క్వార్టర్స్​ బెర్త్​​ ఖాయం చేసుకోగా.. ఆర్చరీలో అతాను దాస్​ ప్రీక్వార్టర్స్​ చేరాడు.

SINDHU, MANU, ATANU
సింధు, మను, అతాను
author img

By

Published : Jul 29, 2021, 11:00 AM IST

ఒలింపిక్స్​లో గురువారం.. భారత్​ జోరు చూపించింది. అన్ని క్రీడల్లో ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేశారు. హాకీ పూల్​-ఏ లో మెరుగైన స్థానంతో టీమ్​ ఇండియా క్వార్టర్​ ఫైనల్​ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. బ్యాడ్మింటన్​లో పీవీ సింధు, బాక్సింగ్​లో సతీశ్​ కుమార్​ క్వార్టర్స్​కు చేరారు. ఆర్చరీలో పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్​.. ప్రీక్వార్టర్స్​ చేరాడు. షూటింగ్​ మహిళల 25 మీ. పిస్టల్​ విభాగంలో తొలి క్వాలిఫికేషన్​ ప్రెసిషన్​ రౌండ్​లో మను బాకర్​ ఐదో(5వ) స్థానంలో నిలిచింది. మరో షూటర్​.. రహి సర్నోబత్​ 25వ స్థానంలో ఉంది. వీరు శుక్రవారం జరిగే ర్యాపిడ్​ ఫైర్​లోనూ ​(క్వాలిఫికేషన్​-స్టేజీ 2) తలపడాల్సి ఉంటుంది.

మొత్తంగా టాప్​-8లో నిలిచిన షూటర్లు.. మెడల్​ రౌండ్​కు అర్హత సాధిస్తారు.

సింధుతో మొదలు..

గురువారం.. భారత్​ దూకుడు షట్లర్ పీవీ సింధుతోనే ప్రారంభమైంది. ఈ ఒలింపిక్స్​లో స్వర్ణపతకంపై గురిపెట్టిన స్టార్​ షట్లర్​.. క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్​లో డెన్మార్క్​ క్రీడాకారిణి మియా బ్లిక్​ఫెల్ట్​ను వరుస సెట్లలో చిత్తు చేసింది.

PV SINDHU
డెన్మార్క్​ షట్లర్​తో తలపడుతున్న పీవీ సింధు

మ్యాచ్​ ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన సింధు.. 21-15, 21-13 తేడాతో గెలిచింది. క్వార్టర్స్​లో సింధు.. జపాన్​ షట్లర్​ అకానె యమగూచితో ఆడనుంది.

హాకీలో జోరు..

హాకీలోనూ భారత్​ జోరు కొనసాగిస్తోంది. గురువారం జరిగిన మ్యాచ్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​ అర్జెంటీనాను 3-1 తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో మెన్​ ఇన్​ బ్లూకు క్వార్టర్ ఫైనల్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే.

HOCKEY INDIA
విజయోత్సాహంలో మెన్​ ఇన్​ బ్లూ

పూల్​ ఏలోని ఆరింట్లో.. నాలుగు జట్లు క్వార్టర్స్​కు​ చేరుతాయి. ప్రస్తుతం 3 మ్యాచ్​లు గెలిచిన టీమ్​ ఇండియా.. ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో ఉంది.

చివరి మ్యాచ్​ను జపాన్​తో ఆడనుంది మన్​ప్రీత్​ సేన.

చివరి 2 నిమిషాల్లో 2 గోల్స్​..

తొలి రెండు క్వార్టర్స్​ గోల్స్​ లేకుండానే ముగిసింది. మూడో క్వార్టర్​లో 43వ నిమిషంలో కుమార్ వరుణ్ భారత్​కు తొలి గోల్ అందించాడు. వివేక్​ సాగర్​ ప్రసాద్​(58వ), హర్మన్​ ప్రీత్​ సింగ్​(59వ) నిమిషాల్లో గోల్స్​ చేసి భారత్​ ఆధిపత్యాన్ని 3-1కి పెంచారు. అర్జెంటీనాకు ఏకైక గోల్​ 48వ నిమిషంలో.. పెనాల్టీ కార్నర్​ రూపంలో వచ్చింది.

ఇదీ చూడండి: Olympics: కొలనులో కొత్త చేప

ఛాంపియన్​కు షాక్​ ఇచ్చిన అతాను..

భారత ఆర్చర్​ అతాను దాస్​.. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్స్​కు దూసుకెళ్లాడు. 1/32 ఎలిమినేషన్స్​లో చైనీస్​ తైపీకి చెందిన డెంగ్​ యు- చెంగ్​ను 6-4 తేడాతో ఓడించిన అతాను.. తర్వాతి మ్యాచ్​లో దక్షిణ కొరియా టాప్​ ప్లేయర్​ ఓ జిన్​ హయక్​పై షూట్​-ఆఫ్​లో నెగ్గి ప్రీక్వార్టర్స్​లోకి ప్రవేశించాడు.

ATANU DAS
ఆర్చరీలో ప్రీక్వార్టర్స్​కు అతాను దాస్​

తర్వాతి మ్యాచ్​లో జపాన్​కు చెందిన ఫురుకవా తకహరూతో పోటీ పడనున్నాడు అతాను.

ఓ జిన్​.. రెండు సార్లు ఒలింపిక్ ఛాంపియన్​ కావడం విశేషం.

ఈ మ్యాచ్​ ఆద్యతం హోరాహోరీగా సాగింది. తొలి సెట్​ ఓ జిన్​ నెగ్గి 2 పాయింట్లు సాధించాడు. తర్వాతి రెండు సెట్లు టై అవ్వగా.. జిన్​ 4, అతాను 2 పాయింట్లతో నిలిచారు. తర్వాతి సెట్​ అతాను నెగ్గగా 4-4తో స్కోరు సమమైంది. మళ్లీ ఐదో సెట్​ టై అయింది. 5-5తో నిలిచారు. షూట్​-ఆఫ్​లో ఓ జిన్​ 9 స్కోరు చేయగా.. అతాను బాణం గురి తప్పలేదు. 10 పాయింట్లు సాధించి.. మ్యాచ్​ గెలిచాడు.

బాక్సింగ్ క్వార్టర్స్​లో సతీశ్​..

ఒలింపిక్స్​లో బాక్సింగ్​లో భారత ప్లేయర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే తమ తమ విభాగాల్లో పూజారాణి క్వార్టర్స్​, మేరీకోమ్ ప్రీక్వార్టర్స్​లోకి ప్రవేశించగా.. ఇప్పుడు పురుషుల సూపర్​ హెవీ (91 కేజీలు+) విభాగంలో సతీశ్​ కుమార్​ నాకౌట్​కు చేరాడు. జమైకాకు చెందిన రికర్డో బ్రౌన్​ను 4-1 తేడాతో ఓడించాడు సతీశ్​.

SATHISH KUMAR
బాక్సర్​ సతీశ్​ కుమార్​

ఆగస్టు 1న జరిగే క్వార్టర్​ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్​ బాక్సర్​, టాప్​ సీడ్​ జలలోవ్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

మళ్లీ మను ఆశలు..

షూటింగ్​ మహిళల 25. మీ. పిస్టల్​ విభాగంలో మను బాకర్​.. ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. క్వాలిఫికేషన్​ ప్రెసిషన్​ రౌండ్​లో ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం 300 పాయింట్లకు.. 292 సాధించింది.

MANU BHAKER
షూటర్​ మను బాకర్​

మరో షూటర్​ రహీ సర్నోబత్​.. 30 షాట్లకు 287 పాయింట్లతో 25వ స్థానంలో ఉంది.

శుక్రవారం.. క్వాలిఫికేషన్​ ర్యాపిడ్​ ఫైర్​ రౌండ్​ జరగనుంది. మొత్తంగా టాప్​-8లో నిలిచిన షూటర్లు ఫైనల్​కు అర్హత సాధిస్తారు.

ఇవీ చూడండి: IND Vs SL : ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం.. సిరీస్‌ సమం

Olympics: అప్పుడు కొవిడ్‌ పోరులో.. ఇప్పుడు పతక వేటలో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.