టోక్యో ఒలింపిక్స్‌లో 16వ రోజు భారత బృందానికి 3 పతకాలు వచ్చే అవకాశముంది. భారత్‌కు ఈ ఒలింపిక్స్‌లో శనివారమే చివరిరోజు. మొత్తం 3 పతకాంశాల్లో పోటీపడుతుండగా.. అన్నింటిపైనా ఆశలున్నాయి. అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో ప్లేయర్ నీరజ్ చోప్రా బరిలోకి దిగనుండగా.. రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా కాంస్యం కోసం పోరాడనున్నాడు. గోల్ఫ్‌లో అదితి అశోక్‌కు కూడా రజతం లభించే అవకాశం ఉంది.
ఇప్పటికే భారత్‌కు ఈ ఒలింపిక్స్‌లో 5 పతకాలు (2 రజతాలు, 3 కాంస్యాలు) రాగా.. చివరిరోజు మరో రెండు పతకాలు సాధించినా విశ్వక్రీడల్లో మనదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా మిగిలిపోతుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు సాధించడమే ఇప్పటివరకు భారత్‌కు గొప్ప ప్రదర్శన. ఈసారి దానిని అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
శనివారం భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే..
గోల్ఫ్.. (రౌండ్-4)
![Tokyo Olympics, Day 16: Indian athletes to watch out for](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12695597_sh.jpg)
మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 4 మ్యాచ్ కోసం భారత్ తరఫున అదితి అశోక్, దీక్షా దగర్ పాల్గొననున్నారు.
దీక్షా దగర్ - ఉ. 4.17 గంటల నుంచి
అదితి అశోక్ - ఉ. 4.48 గంటలకు నుంచి
ఈ మ్యాచ్ కూడా శుక్రవారం జరగాల్సి ఉండగా, వాతవరణ సమస్యల కారణంగా శనివారానికి వాయిదా పడింది. ఒకవేళ రేపు కూడా మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితికి రజతం లభిస్తుంది. తొలిసారి భారత్‌కు గోల్ఫ్‌లో పతకం సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టిస్తుంది.
శుక్రవారం జరిగిన రౌండ్ 3 మ్యాచ్‌లో రెండో స్థానంలో నిలిచిన అదితి.. ఈ ఈవెంట్లో రజతం సాధించే అవకాశముంది. ప్రస్తుతం మూడు రౌండ్ల తర్వాత రెండో స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన నెల్లి కొర్డా మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా హన్నా గ్రీన్, న్యూజిలాండ్‌కు చెందిన లైడియా మూడో స్థానంలో ఉన్నారు.
రెజ్లింగ్.. (కాంస్య పోరు)
![Tokyo Olympics, Day 16: Indian athletes to watch out for](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12695597_sjk.jpg)
పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగం సెమీస్‌లో ఓడిపోయిన బజరంగ్ పునియా కాంస్యం కోసం పోరాడనున్నాడు. ఈ మ్యాచ్ సాయంత్రం 3.15 గంటల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అథ్లెటిక్స్.. (జావెలిన్ త్రో ఫైనల్)
పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో అదరగొట్టిన నీరజ్ చోప్రా.. తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు ఎంపికయ్యాడు. ఈ ఒలింపిక్స్‌లో అతడు కచ్చితంగా పతకం గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నారు క్రీడాభిమానులు. క్వాలిఫికేషన్ రౌండ్లో జావెలిన్‌ను ఏకంగా 86.59 మీ.(83 మీ. విసిరితే అర్హత) విసిరి ఆశ్చర్యపరిచాడు.
![Tokyo Olympics, Day 16: Indian athletes to watch out for](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12695597_a1.jpg)
ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరుతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత పోటీలు ముగియనున్నాయి.
స్వర్ణం తీసుకురావాలి..
నీరజ్ చోప్రా ఫైనల్ నేపథ్యంలో.. అతడు భారత్‌కు స్వర్ణపతకం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఒడిశాకు చెందిన మానస్ కుమార్ సాహో అనే ఆర్టిస్ట్ అతడికి మద్దతుగా బీచ్‌లో సైకతశిల్పాన్ని రూపొందించాడు. యావత్ భారతం స్వర్ణ పతకం కోసం ఎదురుచూస్తోందని, కచ్చితంగా పతకం తేవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి: 'ఈ ఓటమి గెలుపుతో సమానం.. వాళ్ల ఆట అద్భుతం'