టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) మహిళల సైక్లింగ్‌లో కెనడాకు చెందిన కెల్సీ మిచెల్(Kelsey Mitchell) స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పతకాల ప్రదాన కార్యక్రమం పూర్తవ్వగానే స్టేడియాన్ని వీడే క్రమంలో.. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్లతో ప్రాంక్ చేసింది. ఆ వీడియోను కెల్సి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.
కరోనా సంక్షోభంలోనూ ఒలింపిక్స్‌ను జపాన్ ప్రభుత్వం నిర్వహించిన తీరును కెల్సీ మిచెల్ కొనియాడుతూ.. ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దాంతో పాటు జపాన్ స్టేడియం వద్ద సెక్యూరిటీ గార్డ్లతో ఆమె చేసిన ఓ ప్రాంక్ వీడియోనూ(Kelsey Mitchell prank) జతచేసింది. సైక్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత స్టేడియాన్ని వీడే క్రమంలో.. తన గోల్డ్ మెడల్‌ను టీషర్ట్ లోపల ధరించి మెటల్ డిటెక్టర్ వద్ద చెకింగ్‌కు వెళ్లింది. అంతలోనే ఆ డిటెక్టర్ బీప్ సౌండ్స్ చేయడం వల్ల అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఆమె వద్దకు వచ్చారు. అంతలోనే ఆమె నవ్వుతూ.. తన మెడలో ఉన్న బంగారు పతకాన్ని తీసి చూపించింది. చివరికి అది ప్రాంక్ అని తెలుసుకున్న సిబ్బంది.. నవ్వుతూ, ఆమెను చప్పట్లతో అభినందించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి.. Smart Ball Cricket: ఈ బంతి చాలా స్మార్ట్ గురూ!